Telangana Land Records Search తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు కాని భూయజమానులు కాని తమకు సంబంధించిన భూమి వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడానికి వీలుగా ఒక మాడ్యూల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాడ్యూల్ ద్వారా మనము ధరణి పోర్టల్ లో మన సర్వే నంబర్ ద్వారా మన భూమి యొక్క విస్తీర్ణం మరియు ఖాతా నంబరు భూమికి సంబంధించిన తదితర వివరాలు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది.
- భూమి ఉన్న జిల్లా పేరు
- భూమి ఉన్న మండలం పేరు
- భూమి గ్రామం పేరు (శివారు, ఈలక )
- సర్వే నంబరు
ఈ మాడ్యూల్ ద్వారా భూయజమానులకు కానీ రైతులు కానీ తమ యొక్క భూమి వివరాలు చూసుకోవడానికి తమ దగ్గర ఉన్న పాస్ బుక్ లోని సర్వే నంబర్ ద్వారా చూసుకోవచ్చు. ఇందు కొరకు రైతులు కానీ భూ యజమానులు గానీ ధరణి పోర్టల్లోకి వెళ్లి ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత భూమియొక్క వివరాలు నమోదు చేసి భూమికి సంబందించిన విషయాలు చూడవచ్చు.
Land Record Search ద్వారా భూమి యొక్క యజమాని పేరు, భూమి విస్తీర్ణం, యజమాని యొక కాస్ట్, డిజిటల్ సిగ్నచర్ స్థితి, భూమి పై ప్రస్తుతం జరిగే లావాదేవీల వివరాలు, భూయొక్క సహజ స్థితి మొదలగునవి తెలుసుకోవచ్చు.