Dharani Portal : ధరణి పోర్టల్ ఎలా పనిచేస్తుంది?
Dharani Portal telangana :
తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలలో Dharani Porta ఒకటి. మాన్యువల్ గా జరిగే భూమి బదలయిపు ప్రక్రియను మరియు అప్పటికే ఉన్న దస్త్రాలు మరియు సర్వ్ నంబర్ల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డిజిటల్ గా మార్చి రైతులకు భుయజమనులకు కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయడం జరిగినది. ధరణి పోర్టల్లో నమోదు చేసిన వివరాలు సర్వేనంబరు, విస్తీర్ణం, భూమి పొందిన పద్దతి ఈ ధరణి పాసుపుస్తకములో ఉంటాయి.
DHARANI PORTAL పాసుపుస్తకంలో తప్పులు:
Dharani Portal డిజిటలైజేషన్ చేసే సమయంలో చాలా తప్పులు జరిగాయి కొంత మంది పాసుపుస్తకాల్లో సర్వే నంబర్లు మిససవ్వటం . పేర్లు తప్పుగా రావడం, భూమి విస్తీర్ణం తక్కువగా రావడం వంటివి. వాటిని సవరించడానికి ధరణి పాసుపుస్తకాలు జారీ చేసే సమయం లోనే తప్పుల సవరణకు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఇలా ఏర్పాటు చేయబడ్డ సిబ్బంది సదరు భూయజమాణికి ఉన్న అభ్యంతరాలు లికితపూర్వకంగా సేకరించి వాటిని రెవన్యు రికార్డుల ఆధారంగా వాటిని పరిశీలించి భూయాజమనుల అభ్యంతరాలు ఆమోదయోగ్యంగా ఉంటే వాటిని పరిష్కరించి , ఆమోదయోగ్యంగా లేనివాటిని తిరస్కరించడం జరిగినది. ఇలా తిరస్కారణకు గురియాయిన అభ్యంతర ఫిర్యాదులు సదరు రైతు ఆన్లైన్ Dharani Portal ల్లో ప్రత్యేక మైన మాడ్యూల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
![]() |
Dharani Portal Passbook |
DHARANI PORTAL ద్వారా ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? :
DHARANI PORTAL పాసుపుస్తకంలో తప్పుల సవరనకు సదరు భూయజమాణి స్తానీక మీసేవ కేంద్రాని కానీ, కోమోన్ సర్వీస్ సెంటర్ (c s c ) కి వెళ్ళి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనవచ్చు .