Prohibited Properties in Telangana / తెలంగాణలో నిషేధిత ఆస్తి ఏమిటి?
తెలంగాణలో నిషేదిత ఆస్తులు అనగా ఏదైనా ఒక ఆస్తిని కానీ భూమిని కానీ కొంటానికి లేక అమ్మడానికి వీలు లేనటువంటి వాటిని నిషేదిత ఆస్తులు అంటారు . ఇట్టి ఆస్తులు కానీ భూములు కానీ సామాన్య ప్రజలకు కానీ ఇతరులకు కానీ అమ్మటం లేదా కొనటం నిషిద్దం. ఇవి ప్రభుత్వానికి చెందిన లేదా ప్రభుత్వ వర్గాలకు చెందిన ఆస్తులుగా పరిగానీచబడ్డాయి.
భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908 (సెక్షన్ 22-ఏ) భారత దేశంలోని నిషేదిత జాబితాలోని ఆస్తులను నియంత్రిస్తుంది. సాదారణంగా ఎవరైనా ఏదైనా ఆస్తిని కానీ భూమిని కానీ కొనేముందు అట్టి ఆస్తి నిషేదిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత అట్టి ఆస్తిని కొనుగోలు లేదా అమ్మకం చేయడానికి ఆసక్తి చూపాల్సి ఉంటుంది.
నిషేదిత జాబితాలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేస్తే ఏమవుతుంది ?
భారతీయ రెజిస్ట్రేషన్ చట్టం 1908 (సెక్షన్ 22-ఏ ) ప్రకారం నిషేదిత భూముల జాబితాలోని ఆస్తి కొనటం కానీ అమ్మటం కానీ నేరం . ఒకవేళ ఇట్టి నిషేదిత ఆస్తుల జాబితాలోని ఆస్తిని కానీ భూమిని కానీ ఎవరయినా కొనుగోలు చేసిన అట్టి ఆస్తి రెజిస్ట్రేషన్ జరగదు. ఒకవేళ జరిగిన ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇట్టి ఆస్తిని ప్రభుత్వానికి అవసరం అయిన యెడల ప్రబుత్వం ఇట్టి భూమిని తిరిగి తీసుకొనగలధు. కావును ఆస్తిని కొనటానికి ముందు ఆసతీయొక్క వివరాలు క్షున్నముగా పరిశీలించుకోవాలి.
తెలంగాణలో నిషేదిత జాబితాలోనికి ఎటువంటి ఆస్తులు వస్తాయి ?
తెలంగాణ నిషేదిత భూముల మరియి ఆస్తుల జాబితాలోనికి వచ్చు అంశాలు
- బంజారు భూములు
- ఎండోమెంట్ భూములు
- వక్ఫ్ బోర్డ్ భూములు
- పొరంబోకు భూములు
- మిలటరీ కి సంబందించిన భూములు
- రక్షణ దళాలకు సంబందించిన భూములు
- ప్రభుత్వ రంగానికి సంబందించిన సంస్తల భూములు ( ఉదా :ఆర్ టి సి మరియు సింగరేణి )
- లవని పట్టా భూములు
- శికం భూములు
- పరంపొగు భూములు మొదలైనవి
ఆస్తులు :-
- ప్రభుత్వ కార్యాలయాలు
- ప్రభుత్వ కట్టడాలు /నిర్మాణాలు
- ప్రభుత్వానికి సంబండిచిన వాహనాలు
- ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థ ల ఆస్తులు యంత్రాలు మొదలగునవి
ప్రభుత్వ రంగానికి లేదా ప్రభుత్వానికి చెందిన ఆస్తులు ఇతరులు కొనుగోలు చేయాలి అనుకుంటే అది కేవలం ప్రభుత్వం ద్వారా వేలం పాటలో మాత్రమే ఎవరైనా కొనుగోలు చేసుకొనవచ్చు, కానీ ప్రభుత్వ రంగానికి చెందిన భూములు ఇతరులు కొనుగోలు చేసుకోవడానికి వీలులేదు .
HOW TO REMOVE MY LAND FROM PROHIBITED PROPERTIES LIST ? / నిషేదిత జాబితా నుండి మన వ్యక్తిగత ఆస్తిని / భూమిని తొలగించటం ఎలా ?
తెలంగాణ ప్రభుత్వం నిషేదిత ఆస్తుల / భూముల జాబితా నుండి వ్యక్తిగత ఆస్తిని / భూమిని తొలగించటానికి ధరణి పోర్టల్ ద్వారా నిషేదిత భూముల జాబితా నుండి తొలగించడానికి grivance పెట్టవలసి ఉంటుంది ఇట్టి grivance స్తానీక ఆధికారులు పరిశీలించి ఇట్టి భూమి అబిఆర్థి యొక్క వ్యక్తిగత భూమిగా గుర్తించినట్లు అయితే సదరు భూమిని నిషేదిత భూముల జాబితా నుండి తొలగిస్తారు .
FAQ: